Sep 13 2022సెప్టెంబర్ 13:2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 13 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం కృష్ణపక్షము 

తిథి : తదియ  రాత్రి 12గం౹౹32ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భౌమవారం(మంగళవారం)
నక్షత్రం : రేవతి ఈ రోజు ఉదయం 09గం౹౹28ని౹౹ తదుపరి అశ్విని
యోగం :  వృద్ధి ఈ రోజు ఉదయం 07గం౹౹37ని౹౹ తదుపరి ధ్రువ
కరణం : విష్టి ఈ రోజు ఉదయం 11గం౹౹35ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి  04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹46ని౹౹ నుండి 11గం౹౹33ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం :  ఉదయం 07గం౹౹04ని౹౹ నుండి 08గం౹౹39ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹51ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹02ని౹౹

👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️

గురుబోధ*
శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే ఆబ్దికం మాత్రమే కాదు.  ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడ కలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు, కష్టాలు తీరడానికి మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.



expand_less