కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 12 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: నవమి సా. 6.06 కు తదుపరి దశమి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మూల సా. 5.57 కు తదుపరి పూర్వాషాఢ
యోగం: ఆయుష్మాన్ రా. 10.41 కు తదుపరి సౌభాగ్య
కరణం: బాలవ ఉ. 11.45 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.09 - 10.58 కు & మ. 03.04 - 03.53 కు
వర్జ్యం: సా. 4.18 - 5.57 కు & తె. 3.35 - 5.11 కు
అమృతకాలం: ఉ. 11.27 - 1.05 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.21 కు
గురుబోధ:
పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఇంటిల్లిపాదికీ ఆయురారోగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. పితృదేవతల ఆరాధన చేయకుండా ఎన్ని జపతపాలు, తీర్థయాత్రలు చేసినా ఫలితం ఉండదు.