Sep 11 2025సెప్టెంబరు 11 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 11 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్థి సా.5.51 కు తదుపరి పంచమి 12 మ.3.26 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: అశ్వని సా.6.11 కు తదుపరి భరణి 12 సా.4.31 కు
యోగం: ధ్రువ సా.5:04 కు తదుపరి వ్యాఘాత 12 మ.1:43 కు
కరణం: బాలవ మ.12:45 కు తదుపరి కౌలవ రా.11.21 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:10-10:59 కు, మ. 3:03-3:51 కు
వర్జ్యం: మ.2.02-3.32 కు & రా.3.07-4.37 కు
అమృతకాలం: ఉ.7:23-8:51 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ మహాలయ పక్షారంభము (పితృపక్షములు), 4వ రోజు 🕉️

గురుబోధ:
పితృదేవతల ఆరాధన చేయకుండా ఎన్ని జపతపాలు తీర్థయాత్రలు చేసినా ఫలితం ఉండదు. పితృదేవతల ఆరాధన అనగా చనిపోయిన పెద్దలకు సకాలంలో తర్పణాలు, పిండప్రదానాలు, వారిని ఉద్దేశించి దానధర్మాలు చేయడం మొ౹౹ చేయాలి. దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారు.

expand_less