కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 11 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి సా. 6.13 కు తదుపరి నవమి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: జ్యేష్ఠ సా. 5.22 కు తదుపరి మూల
యోగం: ప్రీతి రా. 11.55 కు తదుపరి ఆయుష్మాన్
కరణం: విష్టి ఉ. 11.35 కు తదుపరి బవ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.48 - 12.37 కు
వర్జ్యం: రా. 1.33 - 3.12 కు
అమృతకాలం: ఉ. 8.13 - 9.53 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.21 కు
🕉️ భాద్రపద శుక్ల అష్టమి - దశమ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి జన్మతిథి 🕉️
గురుబోధ:
త్రిభిః సారస్వతం తోయం సప్తాహేనతు యామునం |
సద్యః పునాతి గాంగేయం దర్శనాదేవ నార్మదం ||
(శ్రీ స్కాందపురాణం, అవంతీఖండం-రేవాఖండం, అ.21, శ్లో.6)
సరస్వతీనదిలో 3 రోజులు, యమునానదిలో 7 రోజులు, గంగలో ఒక్కసారి స్నానం చేసిన వెంటనే పవిత్రులమవుతాము. అదే నర్మదానదిని చూసినంత మాత్రానే పవిత్రులమవుతాము. నర్మదను జీవితంలో ఒక్కసారైనా చూడాలి. ఎంతోమంది అక్కడికి వెళ్ళి స్నానం చేసి పవిత్రులయ్యారు. ఇంద్రుడు వృత్రాసురసంహారం తరువాత నర్మదలో స్నానం చేయగా పాపం పోయింది. ఈ శ్లోకం భక్తిశ్రద్ధలతో చదివినా నర్మదను చూసిన పుణ్యం వస్తుంది.