Sep 11 2023సెప్టెంబరు 11 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 11 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : ద్వాదశి రా. 12గం౹౹00ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : పుష్యమి రా. 09గం౹28ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : పరిఘ రా. 10గం౹౹44ని౹౹ వరకు తదుపరి శివ
కరణం :  కౌలవ ఉ. 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹12ని౹౹ వరకు & మ. 02గం౹౹50ని౹౹ నుండి 03గం౹౹39ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : మ. 02గం౹౹28ని౹౹ నుండి 04గం౹౹13ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹50ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹05ని౹౹కు

ద్వాదశీ పారణ

గురుబోధ
శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు. శివ కేశవుల మధ్య భేదం చూపరాదు. ఒకరిని ఎక్కువ చేయడం, మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని పురాణములు చెపుతున్నాయి. పార్థివలింగ (ఇసుక లేదా మట్టితో చేసిన) అర్చన అత్యంత శ్రేష్ఠమైనది. పార్థివలింగార్చన వల్ల తీరని కోరికలు ఉండవు. నిత్యం పార్థివలింగాన్ని తయారు చేసి పూజించడం కుదరకపోతే, మన ఇంటిలో ఉన్న ఏ లింగానికైనా మట్టి పూసి పూజ లేదా అభిషేకం చేసినా అది పార్థివలింగమునకు పూజ చేసిన ఫలితం కలుగజేస్తుందని శాస్త్రం. శ్రీ శివమహాపురాణం ప్రకారం ఎట్టి పరిస్థితిలోనైనా “గురుకటాక్షం ఉంటేనే వాడు శివలింగాన్ని అర్చన చేయగలుగుతాడు”. కేవలం గురుకటాక్షం ఉంటేనే వాడు శివలింగాన్ని పూజించగలడు, శివ కథలను వినగలడు, ఈ జన్మలోనే ముక్తిని పొందగలడు.

expand_less