"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 11 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : పాడ్యమి మధ్యాహ్నం 02గం౹౹23ని౹౹ వరకు తదుపరి విదియ వారం : భానువారం(ఆదివారం) నక్షత్రం : పూర్వాభాద్ర ఈ రోజు ఉదయం 10గం౹౹02ని౹౹ తదుపరి ఉత్తరాభాద్ర యోగం : శూల ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ తదుపరి గండ కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹14ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹28ని౹౹ నుండి 05గం౹౹17ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 07గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 03గం౹౹02ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹50ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹04ని౹౹ 👉🏻🕉️మహాలయపక్షాలు ప్రారంభం🕉️ గురుబోధ మహాలయపక్షాలలో ( భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య ) పితృదేవతల ప్రీత్యర్థం తప్పక పితృకార్యక్రమాల గురించి వినడం, తెలుసుకోవడం చేయాలి. ఉదా౹౹ గరుడపురాణం, మార్కండేయ పురాణము మొ౹౹ వాటిలో పితృ కార్యక్రమాలు, పితృదేవతల చరిత్ర ఉంటాయి. ఆ పురాణములను వినడం, పితృదేవతా స్తోత్రం, యమకృత శివకేశవ నామములు మొ౹౹ పారాయణము చేయడం చేయాలి.