"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 10 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము
తిథి : ఏకాదశి రా. 10గం౹౹20ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : పునర్వసు రా. 07గం౹15ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : వరీయాన్ రా. 09గం౹౹50ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం : బవ ఉ. 06గం౹౹50ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹29ని౹౹ నుండి 05గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹59ని౹౹ నుండి 05గం౹౹44ని౹౹ వరకు & ఉ. 06గం౹౹19ని౹౹ నుండి 08గం౹౹02ని౹౹ వరకు
అమృతకాలం : సా. 04గం౹౹39ని౹౹ నుండి 06గం౹౹22ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹50ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹05ని౹౹కు
🕉 కామిక ఏకాదశి, రవిపుష్యయోగం 🕉
ఏకాదశీ ఉపవాసం, మరునాడు ద్వాదశీ పారణ.
శ్రీ వాసుదేవ శత నామాలు👇శ్రీ అదిత్య స్తవము👇పూజ్యగురుదేవుల ప్రవచనామృతం సంపూర్ణ శ్రీమద్భాగవతం👇గురుబోధ
శ్రావణ కృష్ణ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి కోరికలను తీరుస్తుంది. ఈ ఏకాదశి నాడు భాగవత పారాయణం చేయాలి, ఇలా చేసిన వారికి ఇహము పరము రెండూ లభిస్తాయి. రవిపుష్యయోగం అనేక శుభఫలితాలను ఇస్తుంది. అందునా ఏకాదశి నాడు ఈ యోగం రావడం అపూర్వం. నారాయణుని అర్చనతో పాటు ప్రత్యక్షనారాయణుడు సూర్యభగవానుని అర్చించడం సర్వశుభకరం.