Sep 09 2026సెప్టెంబరు 09 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 09 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: త్రయోదశి ప.11.55 కు తదుపరి చతుర్దశి 9 ప.11.55 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఆశ్లేష ప.3.49 కు తదుపరి మఖ మ. 2.52 కు
యోగం: శివ రా.9:51 కు తదుపరి సిద్ధ 10 రా.7:17 కు
కరణం: వణిజ మ.12:31 కు, విష్టి రా. 11.30 కు తదుపరి శకుని 10 ఉ.10:33 కు
రాహుకాలం: మ. 12.00 – 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.49 – 12.37 కు
వర్జ్యం: తె.5.13 -6.43 కు
అమృతకాలం: మ. 1.42 – 3.12 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.20 కు

🕉️ మాసశివరాత్రి 🕉️

గురుబోధ:
🕉️శివపత్రి లేదా శివ నిర్మాల్యం ఏమి చేయాలి?
శివుని ఆలయలంలో ఇచ్చిన పత్రి నందీశ్వరుని మీద పెట్టాలి. ఎందుకంటే అది మహా శక్తిమంతమైనది, దానిని మోసే శక్తి మనకి లేదు. అందుకే ఈశ్వరుని మీద పెట్టిన బిల్వపత్రమో, దళమో, పుష్పమో మనకిస్తే అవి కళ్ళకద్దుకుని వినయముగా నందీశ్వరుని మీద పెట్టాలి. శివ ప్రసాదాన్ని పొరపాటున కూడా తిరస్కరించకూడదు. కనీసం ఒక్క మెతుకైనా తీసుకోమన్నారు. పండు ఇస్తే, తీర్థమిస్తే కొంచమైనా దానిని స్వీకరించమన్నారు. కొబ్బరికాయ విషయంలో మాత్రం పూర్తిగా అర్చకస్వామిదే బాధ్యత. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ రెండు చిప్పలు అర్చకస్వామివే. ఆయన తనంత తాను ఇస్తేనే మనం పుచ్చుకోవాలి. ఒకవేళ ఇవ్వకుంటే మనం అడిగి తీసుకోకూడదు. తక్కిన ఆలయములలో ఒక చిప్ప మనం అడిగి పుచ్చుకోవచ్చు. – శ్రీ శివమహాపురాణం

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less