Sep 08 2026సెప్టెంబరు 08 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 08 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి ప.1.58 కు తదుపరి త్రయోదశి 9 ప.11.55 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పుష్యమి సా.5.04 కు తదుపరి ఆశ్లేష 9 ప.3.49 కు
యోగం: పరిఘ రా.12:40 కు తదుపరి శివ 9 రా.9:51 కు
కరణం: తైతుల మ.2:43 కు, గరజి రా.1:35 కు తదుపరి వణిజ 9 మ.12:31 కు
రాహుకాలం: మ. 03.00 – 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.33 – 9.22 కు, రా. 11.03 – 11.50 కు
వర్జ్యం: తె.4.41 -6.11 కు
అమృతకాలం: ఉ. 10.40 – 12.09 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.20 కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ మంగళవారం చేయాలి.

🕉️ ప్రదోషం, త్రయోదశి నందీశ్వర అభిషేకం 🕉️

గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివాశివుల ఐక్యరూపం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less