"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 08 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము తిథి : త్రయోదశి రాత్రి 07గం౹౹55ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : బృహస్పతివారం(గురువారం) నక్షత్రం : శ్రవణ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹55ని౹౹ తదుపరి ధనిష్ఠ యోగం : అతిగండ ఈ రోజు రాత్రి 09గం౹౹41ని౹౹ కరణం : కౌలవ ఉదయం 10గం౹౹33ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 09గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹44ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹51ని౹౹ నుండి 03గం౹౹40ని౹౹ వరకు వర్జ్యం : సాయంత్రం 05గం౹౹18ని౹౹ నుండి 06గం౹౹48ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 02గం౹౹19ని౹౹ నుండి 03గం౹౹49ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹50ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹06ని౹౹ గురుబోధ నిత్యం ఈ శ్లోకం పఠనం చేయడం వలన సకల భయాలు నుండి జగన్నాత రక్షిస్తుంది. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే | భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || 5 || ఓ దుర్గాదేవీ! సమస్త స్వరూపములు నీవైన తల్లీ! అందఱికి పాలకురాలైన మాతా! అనేక దేవతాశక్తులతో కూడియున్న మాతా! ఓ ప్రకాశస్వరూపిణీ! మమ్ములను అన్నివిధముల భయముల నుండి రక్షింపుము.