Sep 07 2026సెప్టెంబరు 07 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 07 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి సా.4.13 కు తదుపరి ద్వాదశి 8 ప.1.58 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పునర్వసు సా.6.31 కు తదుపరి పుష్యమి 8 సా.5.04 కు
యోగం: వ్యతీపాత ఉ.6:40 కు తదుపరి వరీయాన్ 8 తె.3:37 కు
కరణం: బవ ఉ.6:17 కు, బాలవ 7 సా.5:04 కు తదుపరి కౌలవ 8 తె.3:53 కు
రాహుకాలం: ఉ. 07.30 – 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.38 – 1.27 కు, మ. 3.05 – 3.54 కు
వర్జ్యం: ఉ.7.19 – 8.48 కు, రా.2.01 – 3.31 కు
అమృతకాలం: మ. 03.59 – 05.29 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.21 కు

🕉️ శ్రావణ మాసం కృష్ణపక్ష ఏకాదశి(కామిక ఏకాదశి) 🕉️

ఏకాదశీ ఉపవాసం సోమవారం ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ మంగళవారం చేయాలి.

గురుబోధ:
🕉️విష్ణువును భక్తితో, అష్టోత్తరశతనామములతో కానీ, విష్ణుసహస్రనామముతో కానీ పూజించాలి.
🕉️కలియుగములో కటిక ఉపవాసము నిషిద్ధము కనుక శరీరము నిలబడుటకు కావలసిన రీతిలో పండుకానీ, పాలు కానీ, అల్పాహారం తీసుకుని ఉపవాసం చేయండి.
🕉️కామిక ఏకాదశి నాడు యథాశక్తి తప్పక భాగవతమును పారాయణ చేయండి. అలా చేసిన వారికి తప్పకుండా ఇహము, పరము రెండూ లాభిస్తాయి.
🕉️మరునాడు ద్వాదశి ఘడియలలో స్నానానంతరము యథాశక్తి దానధర్మాలు చేసుకుని భోజనం చేయాలి. అనుకున్న కోరికలను తీర్చి, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దివ్య తిథి ఈ కామిక ఏకాదశి. ఈ ఉపవాస వ్రతము చేసే వాళ్ళు అన్నదానము చేస్తే మరింత ఫలితం వస్తుంది.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less