కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 07 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: భాద్రపద పూర్ణిమ రా.1.46 కు తదుపరి పాడ్యమి 8 రా.12.11 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: శతభిషం రా.10.58 కు తదుపరి పూర్వాభాద్ర 8 రా.10.11 కు
యోగం: సుకర్మ ఉ.8:22 కు తదుపరి ధృతి 8 ఉ.6:29 కు
కరణం: విష్టి మ.12:43 కు తదుపరి బవ రా.11.38 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:43-5:32 కు
వర్జ్యం: ఉ.6.26-8.00 కు
అమృతకాలం: మ.2.51-4.22 కు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:13 కు
🕉️ భాద్రపదపూర్ణిమ, చంద్రగ్రహణం, శ్రీమద్ భాగవత గ్రంథపూజ, రాహుజయంతి 🕉️
గురుబోధ:
1. పరీక్షిత్ మహారాజుకు శుకుడు భాగవతం భాద్రపద శుక్లపక్ష నవమి నుండి పూర్ణిమ వరకు శ్రీమద్భాగవతమును అందించాడు. అందుకే భాద్రపద పూర్ణిమనాడు భాగవత గ్రంథానికి పట్టాభిషేకం చేయడం ఆచారం. తప్పక ఈరోజు భాగవత గ్రంథాన్ని యథాశక్తి పూజించడం , శ్రవణం చేయడం లేదా కొన్ని శ్లోకాలు అయినా పారాయణం చెయ్యడం చేయాలి.
2. మహాలయ పూర్ణిమనాడే పితృపక్షాలు మొదలవుతాయి. కావాల్సిన ఏర్పాట్లు ఈరోజు నుండే చేయాలి. కానీ కృష్ణపక్ష పాడ్యమి నుండి తర్పణాలు ఇవ్వటం శ్రాద్ధం పెట్టడం చేయాలి.
3. పితృ పక్షాలు ( కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య) పితృదేవతలకు పండుగ వంటివి. ఈ 15 రోజులు పితృదేవతల ప్రీత్యర్థం పితృదేవతా స్తోత్రం, యమ కృత శివకేశవ అష్టోత్తరము చేయడం మంచిది.
4. మరణించిన వారి తిథి శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా ఈ 15 రోజులలో వచ్చే తిథి నాడు పితృ కార్యక్రమాలు నిర్వహించడం, తర్పణాలు ఇవ్వడం చేయాలి.
5. ఉదా|| ఒక వ్యక్తి శుక్లపక్ష నవమి నాడు స్వర్గస్తులైతే వారికి మహాలయ పక్షంలో వచ్చే నవమి నాడు శ్రాద్ధము పెట్టడం చేయాలి.
6. పితృకార్యాలు జరిగేప్పుడు తప్పక హరివంశం లోని బ్రహ్మ దత్తుని కథని వినాలి.
7. రాహుగ్రహ ధ్యాన శ్లోకం : అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం.
https://youtu.be/2XIMubl8kGY?si=bX1VRlVNgXYkcze5
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial