"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబర్ 07 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
భాద్రపదమాసం శుక్లపక్షము
తిథి : ద్వాదశి రాత్రి 10గం౹౹09ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : సౌమ్యవారం(బుధవారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹04ని౹౹ తదుపరి శ్రవణ
యోగం : శోభన ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : బవ మధ్యాహ్నం 01గం౹౹35ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹34ని౹౹ నుండి 12గం౹౹23ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 06గం౹౹48ని౹౹ నుండి 08గం౹౹18ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 09గం౹౹07ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు & (8)తెల్లవారి 03గం౹౹48ని౹౹ నుండి 05గం౹౹18ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹49ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹07ని౹౹
👉🏻🕉️వామన ద్వాదశీ🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ ఈ రోజు ఉదయం చేయవచ్చును.
గురుబోధ
భాద్రపద శుక్ల ద్వాదశిన వామన మూర్తి అవతరించాడు. అందుకే వామన ద్వాదశి అంటారు. ఈ రోజు వామనుడును భక్తితో పూజించవలెను, విష్ణుమూర్తిని అష్టోత్తర శతనామవాళితో, అర్చన చేయడం, విష్ణు సహస్రనామ స్త్రోత్ర పారాయణ చేయడం వలన విశేష ఫలితం ఉంటుంది.