కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 06 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: దశమి సా.6.37 కు తదుపరి ఏకాదశి 7 సా.4.13 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఆర్ద్ర రా.8.07 కు తదుపరి పునర్వసు 7 సా.6.31 కు
యోగం: సిద్ధి ఉ.9:44 కు తదుపరి వ్యతీపాత 7 ఉ.6:40 కు
కరణం: వణిజ ఉ.8:42 కు, విష్టి రా.7:29 కు తదుపరి బవ 7 ఉ.6:17 కు
రాహుకాలం: సా. 04.30 – 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.44 – 5.33 కు
వర్జ్యం: తె.5.36 -7.05 కు
అమృతకాలం: ఉ. 10.32 – 12.02 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.22 కు
గురుబోధ:
మన పేరు మీద మన పిల్లల పేరు మీద జీవితంలో ఒక్కసారైనా భాగవత సప్తాహం చేయించుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.అట్టివారికి వారి కుటుంబసభ్యులు లేక ఆప్తులు వారి పేరున భాగవత సప్తాహం జరిపించటమే ఉత్తమమార్గం.