"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబర్ 06 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
భాద్రపదమాసం శుక్లపక్షము
తిథి : ఏకాదశి మంగళవారం(06) రాత్రి 12గం౹౹40ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (07) బుధవారం రాత్రి 10గం౹౹09ని౹౹ వరకు
వారం : భౌమవారం(మంగళవారం)
నక్షత్రం : పూర్వాషాఢ ఈ రోజు సాయంత్రం 04గం౹౹48ని౹౹ తదుపరి ఉత్తరాషాఢ
యోగం : ఆయుష్మాన్ ఈ రోజు ఉదయం 08గం౹౹16ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం : వణిజ సాయంత్రం 04గం౹౹31ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹48ని౹౹ నుండి 11గం౹౹34ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 12గం౹౹13ని౹౹ నుండి 01గం౹౹42ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 12గం౹౹20ని౹౹ నుండి 01గం౹౹49ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹49ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹08ని౹౹
👉🏻🕉️ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు(మంగళవారము) ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ (బుధవారం) ఉదయం చేయవచ్చును.
గురుబోధ
అస్థి సంచయనం అంటే ఏమిటి?
చనిపోయిన వారి
అస్థికలను మూడు భాగాలుగా చేయాలి. మొదటి భాగం దగ్గర లో ఉన్న నదిలో , మరొక భాగం కాశీ లోని గంగ లో చివరి భాగం త్రివేణి సంగమము లో కలపాలి. ఇలా చేస్తే
చనిపోయిన వారు ఉత్తమగతులు పొంది కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. తప్పక ఇది చేయడం పిల్లల బాధ్యత*