కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 05 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: త్రయోదశి రా.3.454 కు తదుపరి చతుర్దశి 6 రా.2.55 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: శ్రవణం రా.11.15 కు తదుపరి ధనిష్ఠ 6 రా.11.20 కు
యోగం: శోభన మ.1:52 కు తదుపరి అతిగండ 6 ఉ.11:51 కు
కరణం: కౌలవ మ.03:46 కు తదుపరి తైతుల 6 తె.3.13 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:33-9:22 కు, మ. 12:39-1:28 కు
వర్జ్యం: రా.3.16-4.52 కు
అమృతకాలం: మ.01:16-02:52 కు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:13 కు
మహాప్రదోషం, ఓణం (కేరళ)
గురుబోధ:
సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. రాత్రి లేక ప్రదోషంతో కూడిన చతుర్దశి, చతుర్దశి తరువాత తిథి (పూర్ణిమ లేక అమావాస్య) శివదర్శనమునకు శ్రేష్ఠకాలములు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial