కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 05 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: విదియ ఉ. 9.50 కు తదుపరి తదియ
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: హస్త పూర్తి తదుపరి చిత్త
యోగం: శుభ రా. 09.08 కు తదుపరి శుక్ల
కరణం: కౌలవ మ. 12.21 కు తదుపరి తైతుల
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.11 - 11.00 కు & మ. 03.08 - 03.58 కు
వర్జ్యం: మ. 2.36 - 4.23 కు
అమృతకాలం: రా. 1.13 - 3.00 కు
సూర్యోదయం: ఉ. 6.03 కు
సూర్యాస్తమయం: సా. 6.26 కు
శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇
https://youtu.be/tOm3F2CXUOg?si=CUPKfbw2WLHGkdxn
గురుబోధ
ఈ స్తోత్రం భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది. ప్రతి శుక్లపక్ష చతుర్థినాడు ఈ స్తోత్రాన్ని విన్నవారికి సంపదలు లభిస్తాయి. ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి. గణేశాలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈ స్తోత్రం వింటే, భూప్రదక్షిణ చేసిన ఫలితం. భయంకరమైన జాతకదోషాలు తొలగించి, విదేశీయానం కావాలనుకొన్నవారికి లభించేలా చేస్తుంది.