Sep 05 2023సెప్టెంబరు 05 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 05 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : షష్ఠి  రా. 08గం౹౹37ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : భరణి మ. 02గం౹46ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : వ్యాఘాత రా. 11గం౹౹24ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం :  వణిజ మ. 03గం౹౹46ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రా. 10గం౹౹49ని౹౹ నుండి 11గం౹౹35ని౹౹ వరకు
వర్జ్యం : రా. 02గం౹౹44ని౹౹ నుండి 04గం౹౹19ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 10గం౹౹04ని౹౹ నుండి 11గం౹౹38ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹49ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు

గురుబోధ
అమ్మవారిని ప్రతి మంగళవారం మంగళచండిక, మంగళగౌరి అనే పేర్లతో పిలుస్తూ , అమ్మని పూజిస్తే చాలా మంచిది. మహాదేవుడు స్వయంగా మంగళదేవతను పూజించి ఈ 3 శ్లోకాలతో స్తోత్రం చేసాడు. తీవ్రమైన కష్టాలలో కూరుకుపోయి పనులు అవ్వక యాతన పడుతున్నవారు, ఈ అపూర్వస్తోత్రం చేస్తే ఆ తీవ్ర కష్టాలు తొలగిపోతాయి. యోగం లేక స్వగృహం విడిచిపెట్టి అద్దె ఇళ్ళలో ఉండేవారు 3 మంగళవారములు ఈ స్తోత్రమును దేవాలయంలో అమ్మవారి సన్నిధానంలో వీలైనన్నిసార్లు పారాయణం చేసుకొని, పుణ్యాత్ములకు యథాశక్తి దక్షిణ ఇస్తే వారి స్వగృహం వారికి తిరిగివస్తుంది. పోయిన ఇల్లు మళ్ళీ కొనుక్కునే శక్తి ప్రసాదిస్తుంది అమ్మ అనుగ్రహం. ఈ స్తోత్రాన్ని మనసు చెదరకుండా శ్రద్ధతో చదివినా, విన్నా సకల శుభములు కలుగుతాయి. అమంగళం జరుగదు. పుత్రసంతానం కలిగి తీరుతుంది.

మంగళచండికా స్తోత్రం👇


మంగళ షష్ఠీ లేదా దేవసేనా స్తోత్రం👇


expand_less