Sep 04 2024సెప్టెంబరు 04 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 04 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: పాడ్యమి ఉ. 7.50 కు తదుపరి విదియ
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఉత్తర తె. 5.18 కు తదుపరి హస్త
యోగం: సాధ్య రా. 08.03 కు తదుపరి శుభ
కరణం: బవ ఉ. 08.46 కు తదుపరి బాలవ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.50 - 12.40 కు
వర్జ్యం: ఉ. 10.46 - 12.32 కు
అమృతకాలం: రా. 9.16 - 11.02 కు
సూర్యోదయం: ఉ. 6.03 కు
సూర్యాస్తమయం: సా. 6.27 కు

శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇
https://www.youtube.com/watch?v=V9W-UfGJ4uY&pp=ygUadmFkZGlwYXJ0aSBwYWRtYWthciBnYW5lc2E%3D

ఈ స్తోత్రం సామాన్యమైనది కాదు. విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది. పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి అందునా భాద్రపదమాసంలో గణేశచతుర్థి వచ్చినప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.

గురుబోధ
శాస్త్రప్రకారం వినాయకుని పూజకు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎటువంటి సందర్భంలోనూ తులసీదళాలు ఉపయోగించరాదు. "శ్రీ శివపురాణం"లో తులసీదళానికి బదులుగా "శిరీషదళము" అని ఉన్నది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.

expand_less