కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 04 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ రా. 2.47 కు తదుపరి తదియ 05 తె. 04.32 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: చిత్త సా. 5.31 కు తదుపరి స్వాతి 05 రా. 7.53 కు
యోగం: వైధృతి 05 తె. 05.22 కు తదుపరి విష్కంభ పూర్తి
కరణం: బాలవ సా. 04.15 కు తదుపరి కౌలవ 05 తె. 05.30 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.30 - 09.18 కు & మ. 12.28 - 01.16 కు
వర్జ్యం: రా. 11.40 - 1.25 కు
అమృతకాలం: ఉ. 10.28 - 12.04 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.02 కు
🕉️ శరన్నవరాత్రులు 2వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ గాయత్రీదేవి అలంకారం 🕉️
గురుబోధ:
అమ్మవారి రూపాలలో బాలారూపం ఉన్నది ఆ రూపాన్ని పూజించడం ఈ కాలంలో చేయాలి. 'సు' అంటే భర్త, 'వాసిని' అంటే ఉన్నది. సువాసిని అంటే భర్త ఉన్న స్త్రీ (ముత్తైదువలని పూజించడం ఈ కాలంలో చేయాలి). రోజూ కుమారీపూజ చేయాలి. ఏడాది దాటిన పిల్ల మొదలుకొని పదకొండు సంవత్సరాలలోపు బాలికలకే కుమారీపూజ చేయాలి. కుమారీపూజలో బాలికలకు అలంకారాలు, వస్త్రాలు ఇవ్వాలి.