Sep 04 2023సెప్టెంబరు 04 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 04 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : పంచమి  రా. 09గం౹౹45ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : అశ్విని మ. 03గం౹17ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం : ధృవ రా. 12గం౹౹59ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం :  తైతుల సా. 04గం౹౹41ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మ. 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹43ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹26ని౹౹ నుండి 12గం౹౹58ని౹౹ వరకు & రా. 12గం౹౹40ని౹౹ నుండి 02గం౹౹14ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹52ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹49ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు

🕉️ పరమహంస పరివ్రాజకాచర్య శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద స్వరస్వతీ స్వామి (టెంబే స్వామి) వారి జన్మతిథి🕉️


గురుబోధ
దత్తాత్రేయ వజ్రకవచం నిత్యం వినాలి. ఒక 40 రోజుల పాటు పారాయణం చేస్తే దత్తాత్రేయుడు మీ ఇంట్లో కొలువుంటాడు. ఇది దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి, దలాదునికి గోపీకుండం దగ్గర చెప్పాడు. ఇలా చెపుతుండగా దూరశ్రవుడు అనే ఒక బోయవాడు (భిల్లుడు) వినడంతో అతనికి సమస్త పాపపరిహారమై శాశ్వత వైకుంఠం లభించింది. అంతటి అపూర్వ శక్తిమంతమైన కవచం ఇది. టెంబే స్వామివారి జన్మతిథినాడు ఇది చదువుకోవడం లేదా వినడం దత్తానుగ్రహన్ని విశేషంగా కలిగిస్తుంది.



expand_less