కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 03 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి రా.1.46 కు తదుపరి అష్టమి 4 రా.11.28 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: కృత్తిక రా.12.57 కు తదుపరి రోహిణి 4 రా.11.25 కు
యోగం: *వ్యాఘాత సా.6:32 కు తదుపరి హర్షణ 4 మ.3:43 కు
కరణం: విష్టి మ.3:27 కు, బవ రా.2:25 కు తదుపరి బాలవ 4 మ.1:21 కు
రాహుకాలం: మ. 01.30 – 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.12 – 11.01 కు, మ. 3.07 – 3.57 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: రా. 10.12 – 11.43 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.24 కు
గురుబోధ:
శ్రావణ కృష్ణ సప్తమి నాడు, బ్రహ్మాది దేవతలంతా దేవకీ వసుదేవులు ఉన్న చెరసాలకు వచ్చారు. వారంతా సూక్ష్మరూపములు ధరించి దేవకీదేవి ఎదురుగా నిలబడ్డారు. వారి ఉనికిని గ్రహించిన దేవకీదేవి ఆశ్చర్యపోయింది. గర్భం ధరించినప్పటి నుంచి పొందుతున్న దివ్య అనుభూతులను జ్ఞప్తి చేసుకొని వారు నిజంగా దేవతలా కాదా అని సందేహపడింది. ఇదంతా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని లీల. వారంతా ఆమె గర్భమును సృశించి నమస్కరించారు. వారంతా భక్తి తన్మయత్వంతో ఆ పరాత్పరుడ్ని స్తుతించారు.
సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం
సత్యస్య యోనిం నిహితం చ సత్యే
సత్యస్య సత్యమృతసత్యనేత్రం
సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః (వ్యాస భాగవతం) (స్కం.10 అ 2 శ్లో 26)
నామధేయాని కుర్వన్తి స్థానాని చ నరా భువి |
దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ || (వ్యా.భా. స్కం 10 అ 2 శ్లో11)
కుముదా చణ్డికా కృష్ణా మాధవీ కన్యకేతిచ |
మాయా నారాయణీశానీ శారదేత్యమ్బికేతి చ|| (వ్యా.భా. స్కం 10 అ 2 శ్లో 12)
నిన్ను – 1. దుర్గ 2. భద్రకాళి 3. విజయ 4.వైష్ణవి 5.కుముదా 6.చండిక 7.కృష్ణ 8.మాధవి 9.కన్యక 10.మాయ 11.నారాయణి 12.ఈశాని 13.శారద 14. అంబికా – అనే 14 నామాలతో నేను స్తుతిస్తున్నాను. ఈ 14 నామాలతో భూమండలంలో నిన్ను పూజిస్తారు. నీకై యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తారు. కలియుగాంతం వరకు నిన్ను పూజించిన వారిని అనుగ్రహిస్తూ ఉండు అని శ్రీమహావిష్ణువు యోగమాయతో అన్నాడు. కన్యకయే వాసవీ కన్యకాపరమేశ్వరి. శారదా నామము కృష్ణుడు ఇచ్చినదే. శంకరాచార్యులు పురాణాలు బాగా ఎఱిగిన వారు కావున శారదా పీఠాలను స్థాపించారు. శారదయే శారదా పరమేశ్వరి. ద్వారకా నగర స్థాపన అయ్యాక కృష్ణుడే స్వయముగా అష్టభుజి అయిన అంబికాలయమును కట్టాడు. కృష్ణావతార సమాప్తి కాగానే ఆ ఆలయము సముద్రంలో కలసిపోయింది.