కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 03 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి రా.3.29 కు తదుపరి ద్వాదశి 4 రా.3.49 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పూర్వాషాఢ రా.9.34 కు తదుపరి ఉత్తరాషాఢ 4 రా.10.39 కు
యోగం: ఆయుష్మాన్ సా.4:16 కు తదుపరి సౌభాగ్య 4 మ.3:21 కు
కరణం: వణిజ సా.4.13 కు తదుపరి విష్టి 4 తె.4.22 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:50-12:40 కు
వర్జ్యం: ఉ.6.14-7.55 కు
అమృతకాలం: సా.06:04-07:46 కు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:13 కు
🕉️ పద్మనాభ ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వదశీపారణ రేపు చెయ్యాలి.
గురుబోధ:
1) ఈ భాద్రపద శుక్ల ఏకాదశిని పద్మనాభ ఏకాదశి అంటారు. ఇది భద్రములు కలిగిస్తుంది.
2) ఈ పద్మనాభ ఏకాదశి ఉపవాస దీక్ష మహాఫలితం వల్ల ఏడు జన్మములలో చేసిన పాపాలు తొలగిపోతాయి. దేవతలు సంతోషిస్తారు.
3) అనావృష్టి తొలగాలంటే, వర్షములు సకాలంలో కురవాలంటే, రోగములు తొలగాలంటే ఈ ఉపవాస దీక్ష చేస్తే తొలగిపోతాయి. సంతృప్తి రావాలంటే కూడా ఈ ఏకాదశీ ఉపవాస వ్రతం చేసి భక్తితో ఆ భగవంతుడిని ప్రార్థిస్తే మనశ్శాంతి కలుగుతుంది.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=HVznXhr9Kz3xvT1Q