కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 03 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: అమావాస్య ఉ. 6.08 కు తదుపరి పాడ్యమి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పుబ్బ రా. 2.50 కు తదుపరి ఉత్తర
యోగం: సిద్ధ రా. 07.05 కు తదుపరి సాధ్య
కరణం: నాగ ఉ. 07.24 కు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.32 - 09.21 కు & రా. 11.06 - 11.52 కు
వర్జ్యం: ఉ. 9.20 - 11.05 కు
అమృతకాలం: రా. 7.43 - 9.28 కు
సూర్యోదయం: ఉ. 6.03 కు
సూర్యాస్తమయం: సా. 6.28 కు
గురుబోధ:
విఘ్నేశ్వరునికి అనంత నామాలున్నాయి. అనేక అవతారాలున్నాయి. ఆయన లీలాగాథలు కూడా అనంతాలే. నిర్గుణుడు. సగుణుడు కూడా విఘ్నేశ్వరుడే. అటువంటి గణేశ్వరునికి మరింత ఇష్టమైన పదహారునామాలు ఉన్నాయని, ఆ పదహారునామాలని భక్తితో తలచుకుంటే సకల శుభాలు కలుగుతాయని వ్యాసమహర్షి సెలవిచ్చాడు. ఈ పదహారు నామాలను ఉచ్చరించినా, విన్నా కూడా శుభాలే కలుగుతాయి. అందునా విద్యారంభసమయంలోనూ, వివాహసమయంలోనూ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు లేక గృహాదులలో ప్రవేశిస్తున్నప్పుడూ, యుద్ధసమయంలోనూ, ఇంకా సర్వకార్యాలలోనూ ఈ నామాలు ఉచ్చరించిన వానికి, విన్నవానికి విఘ్నాలు తొలగిపోతాయి. ఆ నామములను గురించి విడివిడిగా తెలుసుకుందాం. 1. సుముఖుడు 2. ఏకదంతుడు 3. కపిలుడు 4. గజకర్ణకుడు 5. లంబోదరుడు 6. వికటుడు 7. విఘ్నరాజు 8. గణాధిపుడు 9. ధూమకేతుడు 10. గణాధ్యక్షుడు 11. ఫాలచంద్రుడు 12. గజాననుడు. 13. వక్రతుండుడు 14.శూర్పకర్ణుడు 15. హేరంబుడు 16. స్కందపూర్వజుడు.