" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 03 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము
తిథి : చతుర్థి రా. 11గం౹౹07ని౹౹ వరకు తదుపరి పంచమివారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : రేవతి సా. 04గం౹౹07ని౹౹ వరకు తదుపరి అశ్వినియోగం : వృద్ధి 4వ తేదీ తె. 03గం౹౹12ని౹౹ వరకు తదుపరి ధృవకరణం : బవ ఉ. 07గం౹౹31ని౹౹ వరకు తదుపరి బాలవరాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹34ని౹౹ నుండి 05గం౹౹23ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹44ని౹౹ నుండి 06గం౹౹14ని౹౹ వరకు
అమృతకాలం : మ. 01గం౹౹50ని౹౹ నుండి 03గం౹౹21ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹49ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు
🕉️ సంకష్ట హర చతుర్థి🕉️
గురుబోధ
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. చంద్రోదయ సమయానికి చతుర్థీతిథి ఖచ్చితంగా ఉండాలి. ఈ వ్రతాన్ని శమీ (జమ్మి) వృక్షం వద్ద చేస్తే ఎక్కువగా ఫలిస్తుంది. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో ప్రారంభిస్తే మంచిది. ఆచరించేవారు విఘ్నేశ్వరుని ప్రతిమను పెట్టుకుని షోడశోపచారాలతో పూజించాలి. శ్రావణమాసంలో నెయ్యి, లడ్డు నివేదన చేయాలి. నివేదించిన పదార్థాలను తాను కొంత ప్రసాదంగా తిని, అందరికీ పంచిపెట్టాలి. ఇలా పన్నెండు మాసాలు కృష్ణపక్ష చతుర్థినాడు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే సంకష్టహర చతుర్థీవ్రతం పూర్తవుతుంది. అప్పుడు సకల సిద్ధులు వస్తాయి, మహాపాపాలు పోతాయి.
విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదించే శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇