Sep 03 2022సెప్టెంబర్ 03 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 03 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం శుక్లపక్షము 

తిథి : సప్తమి ఈ రోజు ఉదయం 09గం౹౹50ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : స్థిరవారం(శనివారం)
నక్షత్రం : అనురాధ ఈ రోజు రాత్రి 09గం౹౹26ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ   
యోగం : వైధృతి ఈ రోజు సాయంత్రం 05గం౹౹00ని౹౹ వరకు తదుపరి విష్కoభ
కరణం : వణిజ మధ్యాహ్నం 12గం౹౹28ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 06గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు 
వర్జ్యం : రాత్రి 02గం౹౹42ని౹౹ నుండి 04గం౹౹12ని౹౹ వరకు 
అమృతకాలం :  ఉదయం 11గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹03ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹49ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹10ని౹౹

గురుబోధ
పితృకార్యక్రమముల పై అవగాహన  తప్పక పిల్లలకు కలిపించాలి. పాతకాలంలో పితృకార్యక్రమనగానే పిల్లలు బడికి, పెద్దలు ఉద్యోగానికి  సెలవులు తీసుకుని మరీ పాల్గొనేవారు. ఇప్పుడు అది కేవలం పెద్దలకే పరిమితి అవుతోంది.  కనీసం పితృదేవతల గురించి, శ్రాద్ధ  విధి విధానాల గురించి  విన్నా పితృదేవతలు అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం పొందినవారికి ఎటువంటి గ్రహదోషాలు, చెడు కర్మలు పీడించవు.

expand_less