Sep 02 2026సెప్టెంబరు 02 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 02 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: పంచమి ఉ.5.52 కు, షష్ఠి 3 తె.3.55 కు తదుపరి సప్తమి 3 రా.1.46 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: భరణి రా.2.19 కు తదుపరి కృత్తిక 3 రా.12.57 కు
యోగం: ధృవ రా.9:11 కు తదుపరి వ్యాఘాత 3 సా.6:32 కు
కరణం:
తైతుల ఉ 6:13 కు, గరజి సా.5:21 కు తదుపరి వణిజ 3 సా.4:26 కు
రాహుకాలం: మ. 12.00 – 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.51 – 12.40 కు
వర్జ్యం: మ.12.34 – 2.05 కు
అమృతకాలం: రా. 08.44 – 10.16 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.25 కు

🕉️ పరమహంస పరివ్రాజకాచర్య శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద స్వరస్వతీ స్వామి (టెంబే స్వామి) వారి ఆరాధన 🕉️

గురుబోధ:
దత్తాత్రేయ వజ్రకవచం నిత్యం వినాలి. ఒక 40 రోజుల పాటు పారాయణం చేస్తే దత్తాత్రేయుడు మీ ఇంట్లో కొలువుంటాడు. ఇది దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి, దలాదునికి గోపీకుండం దగ్గర చెప్పాడు. ఇలా చెపుతుండగా దూరశ్రవుడు అనే ఒక బోయవాడు (భిల్లుడు) వినడంతో అతనికి సమస్త పాపపరిహారమై శాశ్వత వైకుంఠం లభించింది. అంతటి అపూర్వ శక్తిమంతమైన కవచం ఇది. టెంబే స్వామివారి జన్మతిథినాడు ఇది చదువుకోవడం లేదా వినడం దత్తానుగ్రహాన్ని విశేషంగా ప్రసాదిస్తుంది.
https://youtu.be/TN1O0jpvUSQ?si=y59C8i5hsDlhs3Rl

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less