కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 02 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: అమావాస్య పూర్తి గా ఉంది.
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మఘ రా. 12.36 కు తదుపరి పుబ్బ
యోగం: శివ సా. 06.20 కు తదుపరి సిద్ధ
కరణం: చతుష్పాద సా. 06.20 కు తదుపరి నాగ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.40 - 01.30 కు & మ. 03.10 - 03.59 కు
వర్జ్యం: ఉ. 11.40 - 1.23 కు
అమృతకాలం: రా. 9.50 - 11.34 కు
సూర్యోదయం: ఉ. 6.02 కు
సూర్యాస్తమయం: సా. 6.29 కు
పోలాల అమావాస్య వ్రత విధానం
https://youtu.be/sH61QgeW7rg?si=Vpl3dnI0Ur2xlPiu
🕉️ శ్రావణమాస అమావాస్య, సోమవతీ అమావాస్య (అమా సోమవార వ్రతము), పద్మక యోగము, శివనక్తవ్రతము, పోలాల అమావాస్య (కందమొక్క పూజ), అగ్నిసావర్ణిక మన్వాది 🕉️
గురుబోధ
✓ సత్సంతానము కోసం, గర్భదోషాలు తొలగడానికి, పిల్లల భవిష్యత్ బాగుండడానికి పోలాల అమావాస్య వ్రతం చేయడం మంచిది.
✓ సోమవతీ అమావాస్య నాడు రాహుకాలం సమయంలో శివలింగదర్శనం, శివాభిషేకం అత్యంత శుభప్రదం, ఆరోగ్యదాయకం. శివపంచాక్షరీ స్తోత్రం శ్రవణం చేయడం, పారాయణం చేయడం సకలపుణ్యప్రదం.
✓ అమావాస్య పితృదేవతల కు తర్పణములు యథాశక్తి శ్రాద్ధం లేదా స్వయంపాక దానము చేయడం మంచిది. పితృదేవతా స్తవం పారాయణం ఉత్తమం.
పితృదేవతా స్తోత్రము 👇
https://youtu.be/UgnxFM4YHYY?si=jRPSZaZUj_JlPw7k