Sep 01 2026సెప్టెంబరు 01 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 01 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్థి ఉ.7.25 కు తదుపరి పంచమి 2 ఉ.5.52 కు, షష్ఠి 3 తె.3.55 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: అశ్విని 2 తె.3.24 కు తదుపరి భరణి 3 రా.2.19 కు
యోగం: వృద్ధి రా.11:38 కు తదుపరి ధృవ 2 రా.9:11 కు
కరణం: బాలవ ఉ 7:42 కు, కౌలవ రా.7.00 కు తదుపరి తైతుల 2 ఉ 6:13 కు
రాహుకాలం: మ. 03.00 – 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.34 – 9.23 కు, రా. 11.06 – 11.52 కు
వర్జ్యం: రా.11.31 – 1.04 కు
అమృతకాలం: రా. 07.42 – 09.16 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.26 కు

🕉️ భౌమచతుర్థి 🕉️

గురుబోధ:
చతుర్థీ తిథి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారక చతుర్థి లేదా భౌమచతుర్థి అంటారు. మానవులై పుట్టాక ఏదో ఒక ఋణం మనలను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఋణసంబంధమైన విముక్తి అంత తేలిక కాదు. అందునా ధనసంబంధమైన ఋణాలు మానవులని బాగా పట్టి పీడిస్తుంటాయి. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందువలన ఈ స్తోత్రాన్ని తప్పక భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నా, విన్నా సకల ఋణాలూ తొలగిపోతాయి. అందునా మంగళవారమునాడు ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.

ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రము👇
https://youtu.be/Ij6aTtQF42Y?si=TmOsGcnDLMFOEnRo

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less