"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబర్ 01 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
భాద్రపదమాసం శుక్లపక్షము
తిథి : పంచమి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹58ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : బృహస్పతివారం(గురువారం)
నక్షత్రం : స్వాతి ఈ రోజు రాత్రి 11గం౹౹27ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : బ్రహ్మ ఈ రోజు రాత్రి 09గం౹౹12ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం : బాలవ మధ్యాహ్నం 02గం౹౹49ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 09గం౹౹56ని౹౹ నుండి 10గం౹౹46ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 06గం౹౹02ని౹౹ నుండి 07గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 02గం౹౹50ని౹౹ నుండి 04గం౹౹24ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹49ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹11ని
🕉️👉🏻ఋషి పంచమి🕉️
గురుబోధ
స్త్రీలు బయట ఉన్న సమయంలో తెలిసీ తెలియక చేసిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఋషిపంచమి అనే వ్రతం ప్రతి సం౹౹ భాద్రపద శుక్ల పంచమి నాడు ఆచరిస్తారు.