"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 31 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి: దశమి ఈ రోజు ఉదయం 09గం౹౹42ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం: మఘ ఈ రోజు ఉదయం 09గం౹౹49ని౹౹ వరకు తదుపరి పుబ్బ యోగం: బ్రహ్మ ఈ రోజు రాత్రి 11గం౹౹32ని౹౹ వరకు తదుపరి వైధృతి కరణం : విష్టి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹27ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹58ని౹౹ నుండి 04గం౹౹44ని౹౹ వరకు వర్జ్యం: సాయంత్రం 05గం౹౹53ని౹౹ నుండి 07గం౹౹29ని౹౹ వరకు అమృతకాలం ఉదయం 07గం౹౹20ని౹౹ నుండి 08గం౹౹58ని౹౹ వరకు & తెల్లవారి 03గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹09ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹30ని౹౹ వరకు గురుబోధ: ముఖం మీద బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండరాదు. బయటికి వెళ్లరాదు. ప్రయాణం కూడా చేయరాదని శాస్త్రం. వారి సంప్రదాయాన్ని అనుసరించి విభూతి, వైష్ణవ నామాలు లేదా కుంకుమ ధరించాలి.