"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 29 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి: అష్టమి ఈ రోజు ఉదయం 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి నవమి వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: పుష్యమి ఈ రోజు ఉదయం 07గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష యోగం: శుభ ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹09ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 09గం౹౹19ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ వరకు అమృతకాలం లేదు సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹32ని౹౹ వరకు గురుబోధ: నిత్యకర్మలు అనగా ఉదయం సంధ్యావందనం, దేవతా పూజ, జపం, పారాయణం తప్పక చేయడం. నైమిత్తిక కర్మలు అనగా పండుగలు, పూర్ణిమ, అమావాస్య , సంక్రమణం మొ౹౹ పర్వదినములలో చేసే విశేష పూజలు, జపములు నైమిత్తిక కర్మలు అంటారు. నిత్యకర్మలు ఆచరించేవారికే నైమిత్తిక కర్మలు ఆచారించే అర్హత కలుగుతుందని శాస్త్రం.