"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 25 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి: పంచమి తె 04గం౹౹28ని౹౹ తదుపరి షష్ఠి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: మృగశిర ఈ రోజు రాత్రి 01గం౹౹42ని౹౹ తదుపరి ఆరుద్ర యోగం: పరిఘ ఈ రోజు రాత్రి 10గం౹౹57ని౹౹ వరకు తదుపరి శివ కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹58ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹55ని౹౹ వరకు& మధ్యాహ్నం 02గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹14ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 05గం౹౹25ని౹౹ నుండి 07గం౹౹03ని౹౹ వరకు అమృతకాలం మధ్యాహ్నం 03గం౹౹56ని౹౹ నుండి 05గం౹౹42ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹59ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹34ని౹౹ వరకు గురుబోధ: కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవ పరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది.