"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 20 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్ల పక్షము తిథి: పూర్ణిమ రాత్రి 06గం౹౹48ని౹౹ తదుపరి పాడ్యమి వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: రేవతి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹47ని౹౹ తదుపరి అశ్విని యోగం: హర్షణ ఈ రోజు రాత్రి 09గం౹౹11ని౹౹ వరకు తదుపరి వజ్ర కరణం : భద్ర ఈ రోజు ఉదయం 09గం౹౹23ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹24ని౹౹ నుండి 12గం౹౹11ని౹౹ వరకు వర్జ్యం:లేదు అమృతకాలం ఉదయం 11గం౹౹17ని౹౹ నుండి 12గం౹౹56ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹38ని౹౹ వరకు గురుబోధ: ఆశ్వయుజ పూర్ణిమ - ఆదికవి, ఆదికావ్యాన్ని అందించిన శ్రీ వాల్మీకిముని జయంతి. రామాయణాన్ని మనకు అందించి రామభక్తి సామ్రాజ్యంలో తరించే భాగ్యం కల్పించిన శ్రీ వాల్మీకి ముని మనకు ప్రాత: స్మరణీయుడు. ఈ రోజు శ్రీ మద్రామాయణం లో ఒక శ్లోకమో, ఒక ఘట్టమో లేదా రామాయణ ఫలశ్రుతి అయినా విని తరిద్దాం!