October 14 2021అక్టోబర్ 14 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  అక్టోబర్ 14  2021🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   శరదృతువు
   ఆశ్వయుజ మాసం శుక్లపక్షము

 తిథి: నవమి రాత్రి 09గం౹౹46ని౹౹ తదుపరి దశమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  ఉత్తరాషాఢ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹35ని౹౹ తదుపరి శ్రవణ
యోగం: ధృతి   ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  :  బాలవ ఈ రోజు ఉదయం 07గం౹౹27ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ  రోజు ఉదయం 09గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹33ని౹౹ నుండి 03గం౹౹20ని౹౹ వరకు 
వర్జ్యం: సాయంత్రం 05గం౹౹25ని౹౹ నుండి 07గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం ఉదయం 07గం౹౹31ని౹౹ నుండి 09గం౹౹02ని౹౹ వరకు & రాత్రి 02గం౹౹39ని౹౹ నుండి 04గం౹౹15ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹56ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹42ని౹౹ వరకు 

👉🏻🕉️మహర్నవమి, ఆయుధ(వాహన) పూజ🕉️

గురుబోధ:
ఎటువంటి కష్టము, అనారోగ్యము, ఉద్యోగం ఆలస్యం అవడం, అప్పుల బాధ తొలగడం, కుటుంబములో అశాంతి, వివాహం లేదా సంతానం ఆలస్యం అవుతున్నా లేదా పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక విజయదశమి నాడు శమీవృక్షమును (జమ్మిచెట్టు) పూజించాలి. శమీ వృక్షమును సాక్షాత్ పార్వతీ దేవి గా మనం ఆరాధిస్తాం. పాండవులు, శ్రీరాముడు కూడా శమీపూజ చేశారని పురాణవాక్యం. శమీపూజ చేసేటప్పుడు ఈ శ్లోకం తప్పక చదవాలి.
◆ 1. శమీ శమయతే పాపం  శమీ శత్రువినాశినీ 
    అర్జునస్య ధనుర్ధారీ రామస్యాక్లిష్ట దర్శినీ
 
2. శమీ శమయతే పాపం శమీ లోహితకంటకా 
    ధారిణ్యర్జునబాణానాం  రామస్య ప్రియవాదినీ
expand_less