Oct 30 2025అక్టోబరు 30 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 30 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం

తిథి: నవమి 31 తె.4.20 కు తదుపరి దశమి 01 తె.3.42 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: శ్రవణం మ.2.19 కు తదుపరి ధనిష్ఠ 31 మ.2.37 కు
యోగం: గండ 31 తె.3.11 కు తదుపరి వృద్ధి 01 రా.1:33 కు
కరణం: బాలవ సా.4.24 కు తదుపరి కౌలవ 31 తె.4.20 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:05-10:51 కు, మ. 2:39-3:24 కు
వర్జ్యం: సా.6.22-11.21 కు
అమృతకాలం: తె.04:05-05:42 కు
సూర్యోదయం: ఉ.06:01 కు
సూర్యాస్తమయం: సా.5.27 కు

🕉️ కృతయుగాది, అక్షయనవమి 🕉️

గురుబోధ:
ధర్మం అభివృద్ధి చెందడానికి భక్తితో మంత్రపూర్వకంగా రుద్రాక్షలను ధరించాలి. భస్మమును ధరించినవాడు, రుద్రాక్షను ధరించినవాడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రులు. ఈ రెండింటిని ధరించినవారికి భక్తి, ముక్తి తప్పక లభిస్తాయి. ఈ రెంటినీ ధరించి పంచాక్షరీ జపం చేసేవాడు పరిపూర్ణ శివభక్తుడు.

expand_less