కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 30 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి మ. 12.35 కు తదుపరి చతుర్దశి 31 మ. 2.43 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: హస్త రా. 10.01 కు తదుపరి చిత్త 31 రా. 12.36 కు
యోగం: వైధృతి ఉ. 08.52 కు తదుపరి విష్కంభ 31 ఉ. 08.51 కు
కరణం: వణిజ మ. 01.15 కు తదుపరి విష్టి రా. 02.35 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.37 - 12.23 కు
వర్జ్యం: తె. 4.00 - ఉ. 6.30 కు
అమృతకాలం: మ. 3.19 - 5.05 కు
సూర్యోదయం: ఉ. 6.14 కు
సూర్యాస్తమయం: సా. 5.45 కు
🕉️ నరకచతుర్దశి 🕉️
నరక చతుర్దశి నాడు శ్రీ కృష్ణ పూజ, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. దీపావళీ అమావాస్య నాడు సూర్యోదయమునకు ముందే తప్పక అభ్యంగన స్నానం ఆచరించాలి.
గురుబోధ:
దీపమునకు స్వచ్ఛమైన ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె వాడడం శ్రేష్ఠం. వాసన వచ్చే నూనె, నెయ్యి లేదా రసాయనాలు కలిపిన నూనెలతో 100 దీపములు వెలిగించినా పెద్ద ఫలితం ఉండదు. అదే శ్రేష్ఠమైన నూనె లేదా నెయ్యితో ఒక్క దీపం వెలిగించినా అనంతపుణ్యం లభిస్తుంది.