Oct 30 2022అక్టోబర్ 30 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 30 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తిక మాసం శుక్లపక్షము 

తిథి : పంచమి  ఉదయం 08గం౹౹16ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భానువారం  (ఆదివారం)
నక్షత్రం : మూల ఉదయం 10గం౹౹35ని౹౹ వరకు తదుపరి పూర్వషాఢ
యోగం :  సుకర్మ  ఈ రోజు రాత్రి 07గం౹౹15ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం : కౌలవ ఈ రోజు సాయంత్రం 04గం౹౹38ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 03గం౹౹59ని౹౹ నుండి 04గం౹౹45ని౹౹ వరకు 
 వర్జ్యం : ఉదయం 09గం౹౹05ని౹౹ నుండి 10గం౹౹34ని౹౹ వరకు & రాత్రి 07గం౹౹31ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 04గం౹౹03ని౹౹ నుండి 06గం౹౹04ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹01ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹31ని౹౹

గురుబోధ*

•	శ్రీ మద్ధేవి భాగవతము-  నవమ స్కంధం లో ఉన్న ఈ ద్వాదశ నామమంత్రములను నిత్యం లేదా పర్వదినములలో పఠిస్తే  నాగదోషాలు నశిస్తాయి. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు  కూడా తొలగిపోతాయని ఫలశ్రుతి. నాగదేవతా నామములు : 1. ఓం జరత్కారు ప్రియాయై నమః , 2. ఓం జగద్గౌర్యై నమః, 3. ఓం సిద్ధయోగిన్యై నమః, 4. ఓం నాగభగిన్యై నమః, 5. ఓం నాగేశ్వర్యై నమః, 6. ఓం విషహరాయై నమః, 7. ఓం జగత్కారవే నమః, 8. ఓం మనసాయై నమః, 9. ఓం వైష్ణవ్యై నమః, 10.ఓం శైవ్యై నమః, 11. ఓం ఆస్తీకమాత్రే నమః, 12. ఓం మహాజ్ఞానయుతాయై నమః



expand_less