Oct 29 2025అక్టోబరు 29 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 29 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం

తిథి: అష్టమి 30 తె.4.26 కు తదుపరి నవమి 31 తె.4.20 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ మ.1.32 కు తదుపరి శ్రవణం 30 మ.2.19 కు
యోగం: శూల 30 తె.4:25 కు తదుపరి గండ 31 తె.3:11 కు
కరణం: భద్ర సా.4.15 కు తదుపరి బవ 30 తె. 4.26 కు
రాహుకాలం: మ.12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:37-12:22 కు
వర్జ్యం: సా.5.38-7.16 కు
అమృతకాలం: ఉ.6:46-8.27 కు
సూర్యోదయం: ఉ.6:01 కు
సూర్యాస్తమయం: సా.5.27 కు

🕉️ బుధాష్టమీ పర్వదినం, గోపాష్టమి, కార్తవీర్యార్జున జయంతి 🕉️

గురుబోధ:
🕉️బుధవారం నాడు అష్టమీ తిథి వస్తే బుధాష్టమీ పర్వదినము అని శాస్త్రం చెపుతున్నది. సంవత్సరంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇలా వస్తుంది. బుధాష్టమీ వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ఈ వ్రత విధానము అగ్నిపురాణములో క్లుప్తంగా వివరించారు.
🕉️దీపము వెలిగించడము అత్యంత పుణ్యప్రదం. కానీ దీపముల పేరుతో ఆలయంలో ఉన్న విగ్రహాలకు, నందికి, చెట్లకు ఆనుకుని పెట్టడం వంటివి చేయరాదు. ఆలయధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం మంచిదని శాస్త్రం.
అభిషేకం, దీపం వెలిగించడం కంటే ఆలయం శుభ్రంగా ఉంచడము వల్ల వచ్చే పుణ్యం మరింత గొప్పది.

https://youtu.be/U4KPeiHGdlE?si=HDDWnr08k_6tkv21

expand_less