కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 29 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి ఉ. 10.32 కు తదుపరి త్రయోదశి 30 మ. 12.35 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తర రా. 7.26 కు తదుపరి హస్త 30 రా. 10.01 కు
యోగం: ఐంద్ర ఉ. 07.48 కు తదుపరి వైధృతి 30 ఉ. 08.52 కు
కరణం: తైతుల ఉ. 10.31 కు తదుపరి గరజి రా. 11.53 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.32 - 09.18 కు & రా. 10.45 - 11.35 కు
వర్జ్యం: తె. 4.43 - 6.13 కు
అమృతకాలం: ఉ. 11.29 - 1.14 కు
సూర్యోదయం: ఉ. 6.14 కు
సూర్యాస్తమయం: సా. 5.46 కు
🕉️ ప్రదోషం 🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ రేపు ఉదయం 10 గం.ల లోపే చేయాలి.
గురుబోధ:
🕉️ఆదివారం, శుక్రవారం, మంగళవారాలు తులసి, బిల్వపత్రాలు కోయరాదు.
🕉️శివాలయంలో శివలింగం బయట కాని, ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.
🕉️ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు.