Oct 29 2023అక్టోబరు 29 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 29 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : పాడ్యమి రా. 12గం౹౹23ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : అశ్విని ఉ. 06గం౹౹59ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం : సిద్ధి రా. 08గం౹౹01ని౹౹వరకు తదుపరి వ్యతీపాత
కరణం :  బాలవ మ. 03గం౹౹02ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 03గం౹౹59ని౹౹ నుండి 04గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం : సా. 04గం౹౹18ని౹౹ నుండి 05గం౹౹51ని౹౹ వరకు
అమృతకాలం : రా. 01గం౹౹37ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹00ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹33ని౹౹కు

గురుబోధ - పది సంవత్సరాలకు ఒక్కసారి అరుదుగా వచ్చే మహాయోగం దశమీ తిథి, పునర్వసు నక్షత్రం, ఫాల్గునమాసం కలసి రావడం. ఆరోజు అయోధ్యానగరంలో సరయూనదీ స్నానం మూడున్నరకోట్ల తీర్థములలో చేసే స్నానంతో సమానం. అయోధ్యానగరమును గురించి తెలుసుకున్నవారికి పునర్జన్మ ఉండదు అని వ్యాసులవారు స్కాందపురాణంలో చెప్పారు. అయోధ్యానగరంలోకి అడుగుపెట్టి మూడు రాత్రులు అక్కడ నివసిస్తే (నిద్రిస్తే) అటువంటివారికి ఒక అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. అక్కడ 9 రోజులు నిద్ర చేసినవారు వచ్చే జన్మలోనో లేదా ఆపై జన్మలోనో కాశీలో మరణించి శాశ్వత ముక్తి పొందుతాడు.

expand_less