Oct 28 2025అక్టోబరు 28 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 28 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి 29 తె.4.02 కు తదుపరి అష్టమి 30 తె.4.26 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పూర్వాషాఢ మ.12.13 కు తదుపరి ఉత్తరాషాఢ 29 మ.1.32 కు
యోగం: ధృతి 29 తె.5:14 కు తదుపరి శూల 30 తె.4:25 కు
కరణం: గరజి ప.3.35 కు తదుపరి వణిజ తె.4.02 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:34-9:19 కు, రా.10:44-11:34 కు
వర్జ్యం: రా.8.39.10.20 కు
అమృతకాలం: ఉ.7:04-9:47 కు
సూర్యోదయం: ఉ.6:01 కు
సూర్యాస్తమయం: సా.5.27 కు

🕉️ విష్వక్సేన తిరునక్షత్రం🕉️

గురుబోధ:
పూర్వం శివుడు పార్వతితో ఒకసారి ఇలా అన్నాడు - నేను ఒకప్పుడు లోకశ్రేయస్సు కోసం వేల సంవత్సరాల తపస్సు చేసాను. లోకహితం కోసం నా మనస్సులో ఏదో ఒక ఆందోళన కలిగింది. నేనే కావాలని ఆ ఆందోళన కలిగించుకున్నాను. అప్పుడు మూసుకుని వున్న నా కళ్ళు హఠాత్తుగా తెరుచుకున్నాయి. పవిత్రమైన నా కళ్ళనుండి కొన్ని నీటి బిందువులు నేలపై పడ్డాయి. ఆ బిందువుల నుండి రుద్రాక్ష అనబడే వృక్షాలు పుట్టాయి. భక్తులను అనుగ్రహించడానికి ఆ కళ్ళనుండి నీటివిందువులు, బిందువుల నుండి వృక్షాలు, రుద్రాక్షలు నేనే సృష్టించాను. రుద్రాక్షలను భక్తులకు, బ్రహ్మవిష్ణువు మున్నగువారికి ధరించడానికి ఇచ్చాను.

expand_less