Oct 28 2023అక్టోబరు 28 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 28 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము

తిథి : చతుర్దశి రా. 03గం౹౹36ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : రేవతి ఉ. 08గం౹౹02ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం : వజ్ర రా. 10గం౹౹52ని౹౹వరకు తదుపరి సిద్ధి
కరణం :  విష్టి మ. 03గం౹౹02ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మ. 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹55ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹09ని౹౹ నుండి 04గం౹౹41ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 05గం౹౹46ని౹౹ నుండి 07గం౹౹16ని౹౹ వరకు & రా. 12గం౹౹05ని౹౹ నుండి 01గం౹౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹00ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹33ని౹౹కు

🕉️ ఆశ్వయుజ పూర్ణిమ - ఆదికవి శ్రీ వాల్మీకిముని జన్మతిథి, కోజాగరపూర్ణిమ, గౌరీపూర్ణిమ 🕉️ 

పాకిక్ష రాహగ్రస్త చంద్రగ్రహణం 
గ్రహణం సమయం :- 
స్పర్శ కాలం - శనివారం రాత్రి 1:00 ని|| నుండి
మోక్ష కాలం - శనివారం రాత్రి 2:25 ని|| వరకు.

గురుబోధ - రామాయణాన్ని మనకు అందించి రామభక్తి సామ్రాజ్యంలో తరించే భాగ్యం కల్పించిన శ్రీ వాల్మీకి ముని మనకు ప్రాతఃస్మరణీయుడు. ఈ రోజు శ్రీమద్రామాయణంలో ఒక శ్లోకమో, ఒక ఘట్టమో లేదా రామాయణ ఫలశ్రుతి అయినా వినాలి.

గ్రహణ సమయంలో మంత్రజపం, పురాణశ్రవణం లేదా భగవన్నామ స్మరణ మాత్రమే చేయాలి.
ఆ సమయంలో చేసే జపం వల్ల దేవతలకు బలం చేకూరుతుంది. వారిని రక్షిస్తుంది. ఆ పుణ్యఫలం వల్ల దేవతలు మనకు అక్షయఫలితాన్ని ప్రసాదిస్తారు.



expand_less