" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 27 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసం శుక్లపక్షము తిథి : విదియ మధ్యాహ్నం 02గం౹౹04ని౹౹ వరకు తదుపరి తదియ వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 02గం౹౹19ని౹౹ వరకు తదుపరి అనూరాధ యోగం : అయుష్మాన్ ఈ రోజు ఉదయం 07గం౹౹25ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹43ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹28ని౹౹ నుండి 03గం౹౹14ని౹౹ వరకు వర్జ్యం : సాయంత్రం 06గం౹౹09ని౹౹ నుండి 07గం౹౹41ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 05గం౹౹45ని౹౹ నుండి 07గం౹౹19ని౹౹ వరకు & (28) తెల్లవారి 03గం౹౹21ని౹౹ నుండి 04గం౹౹53ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹33ని౹౹ 👉🏻🕉️యమ ద్వితీయ, భగినీహస్త భోజనం🕉️ గురుబోధ కార్తికమాసం లో శ్రీమన్నారాయణుడ్ని పూజించి, ధాత్రీ (ఉసిరి) వృక్షం ఉన్నచోట చూసుకుని వనభోజనం చేయాలని శాస్త్రం. వనభోజనముకు సంప్రదాయ వంటలు మాత్రమే తీసుకెళ్లాలి.