కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 26 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి రా.12.46 కు తదుపరి షష్ఠి 28 తె.3.07 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.8.20 కు తదుపరి మూల 27 ఉ.10.29 కు
యోగం: అతిగండ 27 తె.5:47 కు తదుపరి సుకర్మ 28 తె.5:41 కు
కరణం: బవ ప.12.54 కు తదుపరి బాలవ రా. 12.46 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.3.58-4.44 కు
వర్జ్యం: సా.5.03-6.47 కు
అమృతకాలం: 27 తె.3.30-5.15 కు
సూర్యోదయం: ఉ. 6:00 కు
సూర్యాస్తమయం: సా. 5:30 కు
🕉️ నాగపంచమి, కార్తిక శుక్ల పంచమి తిరుచానూరు శ్రీ పద్మావతీ మాత అవతరణం🕉️
గురుబోధ:
పరమపవిత్ర కార్తికమాసంలో ప్రతిరోజూ దీపదానం చేయడం, సంకల్ప సహిత స్నానము చేయడం, ఎర్రని పూలతో స్వామికి అలంకరణలు చేయడం ద్వారా దారిద్ర్యం తొలగుతుంది, ఉద్యోగం లభిస్తుంది.