Oct 26 2024అక్టోబరు 26 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 26 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి ఉ. 6.18 కు తదుపరి దశమి 27 ఉ. 07.17
వారం:
స్థిరవారము (శనివారం)
నక్షత్రం:
ఆశ్లేష మ. 1.19 కు తదుపరి మఘ మ. 2.59 కు
యోగం:
శుభ తె. 05.27 కు తదుపరి శుక్ల 27 తె. 05.58 కు
కరణం:
వణిజ మ. 04.19 కు తదుపరి విష్టి 27 తె. 05.23 కు
రాహుకాలం:
ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం:
తె. 06.12 - 07.45 కు
వర్జ్యం:
రా. 2.09 - 3.51 కు
అమృతకాలం:
ఉ. 11.38 - 1.18 కు
సూర్యోదయం:
ఉ. 6.12 కు
సూర్యాస్తమయం:
సా. 5.47 కు

గురుబోధ:*
నాగదేవతా మూర్తులు లేదా ఏ ఇతర విగ్రహ మూర్తులకు అయినా పాలతో అభిషేకం చేసినతర్వాత తప్పక నీటితో శుభ్రంగా అభిషేకం చేయాలి. శ్రీ మద్ధేవి భాగవతము - నవమస్కంధంలో ఉన్న ఈ ద్వాదశ నామమంత్రములను నిత్యం లేదా పర్వదినములలో పఠిస్తే నాగదోషాలు నశిస్తాయి. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోతాయని ఫలశ్రుతి. నాగదేవతా నామములు : 1. ఓం జరత్కారు ప్రియాయై నమః , 2. ఓం జగత్గౌర్యై నమః, 3. ఓం సిద్ధయోగిన్యై నమః, 4. ఓం నాగభగిన్యై నమః, 5. ఓం నాగేశ్వర్యై నమః, 6. ఓం విషహరాయై నమః, 7. ఓం జగత్కారవే నమః, 8. ఓం మనసాయై నమః, 9. ఓం వైష్ణవ్యై నమః, 10.ఓం శైవ్యై నమః, 11. ఓం ఆస్తీకమాత్రే నమః, 12. ఓం మహాజ్ఞానయుతాయై నమః

expand_less