Oct 26 2023అక్టోబరు 26 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 26 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము

తిథి : ద్వాదశి ఉ. 08గం౹౹02ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : పూర్వాభాద్ర ఉ. 10గం౹౹49ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : ధ్రువ ఉ. 08గం౹౹50ని౹౹వరకు తదుపరి వ్యాఘాత
కరణం :  బాలవ ఉ. 09గం౹౹44ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹49ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు & మ. 02గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹14ని౹౹ వరకు
వర్జ్యం : రా. 07గం౹౹49ని౹౹ నుండి 09గం౹౹19ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹49ని౹౹ నుండి 06గం౹౹19ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹00ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹34ని౹౹కు

🕉️ ప్రదోషం, గోద్వాదశి/పద్మనాభ ద్వాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు ఉదయం 8 గం.ల లోపు చేయాలి.

గురుబోధ ప్రదోషం - సూర్యాస్తమయము కు ముందు 20 ని||  మరియు తర్వాత 20 ని||  కలిపి ప్రదోష సమయం గా పరిగణిస్తారు. 
 ప్రతి రోజు ప్రదోష సమయం లో శివపూజ, శివార్చన, అభిషేకం విశేష ఫలితం ఇస్తుంది. అదే ప్రతి నెలా వచ్చే రెండు  త్రయోదశీ తిథులలో ఉన్న ప్రదోషం  మరింత విశేషం.  పురాతన శివాలయములలో  ఈ రెండు ప్రదోష సమయము లలో తప్పక అభిషేకం చేయడం ఆచారం. అలాగే శనివారం సాయంత్రం ప్రదోష సమయం (శని ప్రదోషం) కూడా చాలా విశేషమైనది .



expand_less