Oct 25 2023అక్టోబరు 25 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 25 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము

తిథి : ఏకాదశి ఉ. 10గం౹౹25ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : శతభిషం మ. 12గం౹౹28ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం : వృద్ధి మ. 12గం౹౹18ని౹౹వరకు తదుపరి ధృవ
కరణం :  విష్టి మ. 12గం౹౹32ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹23ని౹౹ నుండి 12గం౹౹09ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹22ని౹౹ నుండి 04గం౹౹51ని౹౹ వరకు & రా. 06గం౹౹19ని౹౹ నుండి 07గం౹౹48ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 05గం౹౹47ని౹౹ నుండి 07గం౹౹17ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹58ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹36ని౹౹కు

🕉️ ఏకాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణ 26వ తేదీ చేయాలి.

గురుబోధ నిద్ర లేవగానే వామనుడిని తలుచుకోవాలి ఎందుకంటే ఆయన పొట్టిగా పుట్టి 3 అడుగులు పుచ్చుకొని ముల్లోకాలు ఆక్రమించాడు. అందుకనే మనము కూడా లేవగానే మన బ్రతుకు చాలా చిన్నది కానీ వామనుడిని తలుచుకోవడం వల్ల ఆ రోజంతా మనము త్రివిక్రముడిలా విజృంభిస్తాము, ఎటువంటి ఒడిదుడుకులు రావు. అందుకనే లేవగానే అందరూ వామన వామన వామన అని భక్తితో తలుచుకొని ఆ తరువాత మీ పనుల్లోకి వెళితే ఆ రోజంతా ఏ తగాదాలు ఉండవు, విజృంభిస్తారు.

శ్రీ వాసుదేవ శత నామాలు👇


expand_less