" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 25 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి : అమావాస్య సాయంత్రం 04గం౹౹14ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : చిత్త మధ్యాహ్నం 02గం౹౹12ని౹౹ వరకు తదుపరి స్వాతి యోగం : విష్కoభ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : నాగవాన్ ఈ రోజు సాయంత్రం 04గం౹౹14ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹0ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉ౹౹ 08గం౹౹33ని౹౹ నుండి 09గం౹౹19ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹35ని౹౹ నుండి 11గం౹౹35ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 07గం౹౹36ని౹౹ నుండి 09గం౹౹09ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 07గం౹౹55ని౹౹ నుండి 09గం౹౹29ని౹౹ వరకు & (26) తెల్లవారి 04గం౹౹52ని౹౹ నుండి 06గం౹౹02ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹15ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹45ని౹౹ 👉🏻🕉️దీపావళి🕉️ కేతుగ్రస్త సూర్యగ్రహణం, పద్మకయోగం గ్రహణం సమయం - అక్టోబర్ 25, సాయంత్రం 5:02 నుంచి 5:38 నిమిషాలకు గురుబోధ ◆ గ్రహణం ముందు ప్రదక్షిణలు చేయడం గ్రహణం అయ్యాక ఆలయం శుద్ధి చేయడం, ప్రదక్షిణలు చేయడం అత్యంత పుణ్యప్రదం. ◆గ్రహణ నియమాలు పాటించేవారికి సంవత్సరం మొత్తం చేసే నిత్య నైమిత్తిక కర్మల పుణ్య ఫలితం ఆ ఒక్కరోజే వస్తుందని శాస్త్రం. ◆అందుకే భక్తులు గ్రహణ సమయాన్ని జపము, స్తోత్ర పారాయణము వంటివి చేసి సద్వినియోగం చేసుకుని తరిస్తారు. ◆యజ్ఞోపవీతం ధరించిన వారు గ్రహణం అయ్యాక నూతన యజ్ఞోపవీతం ధరించాలి.