కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 24 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి 25 తె. 5.57 కు తదుపరి నవమి పూర్తిగా ఉంది
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పునర్వసు ఉ. 11.28 కు తదుపరి పుష్యమి మ. 12.08 కు
యోగం: సాధ్య 25 తె. 05.23 కు తదుపరి శుభ 26 తె. 05.27 కు
కరణం: బాలవ మ. 01.32 కు తదుపరి కౌలవ రా. 01.58 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.04 - 10.50 కు & మ. 02.43 - 03.29 కు
వర్జ్యం: రా. 7.39 - 9.18 కు
అమృతకాలం: తె. 5.33 - 7.03 కు & ఉ. 9.02 - 10.38 కు
సూర్యోదయం: ఉ. 6.12 కు
సూర్యాస్తమయం: సా. 5.49 కు
గురుబోధ:
ఎడమ చేతితో ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోకూడదని శాస్త్రం. పాలు, నీళ్లు కూడా ఎడమచేతితో తీసుకోవడం మంచిది కాదు. అందుకే భోజనం చేసేప్పుడు కూడా కుడి చేతి వైపు నీళ్ళ చెంబు కుడి వైపు పెట్టుకుంటాము. సంప్రదాయం తెలిసిన పెద్దలు భోజనం మధ్యలో నీళ్ళు తాగాల్సి వస్తే ఎడమ చేతితో నీళ్ళ చెంబు పట్టుకుని, కుడి చేయి మణికట్టు తగిలించి తాగుతారు.